పాకిస్థాన్ వైట్ బాల్ జట్లకు కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టెన్ వైదొలిగాడు. కోచ్‌గా బాధ్యతలు అందుకున్న ఆరు నెలలకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పీసీబీ వైఖరి, ఆటగాళ్లతో గొడవలు, భిన్నాభిప్రాయాల మధ్య కొనసాగలేక కిర్‌స్టెన్ పాక్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టెన్ సక్సెఫుల్ కోచ్‌గా పేరు పొందాడు. 2011 వన్డే ప్రపంచకప్ భారత్ విజయం సాధించడంలో కిర్‌స్టెన్ పాత్ర కీలకం.