ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ

54చూసినవారు
ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ మరోసారి ఆసియా సంపన్నుడిగా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ వెనక్కి తగ్గారు. గత కొద్ది రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పెరగడంతో గౌతమ్ అదానీ నికర విలువ వేగంగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ 12వ స్థానానికి చేరుకున్నాడు.