‘ఉష్ణోగ్రత’ సెగ.. 2 గంటలు నిలిచిపోయిన విమానం

85చూసినవారు
‘ఉష్ణోగ్రత’ సెగ.. 2 గంటలు నిలిచిపోయిన విమానం
అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగింది. ఇండిగో విమానం 6E 2521 ఢిల్లీ నుంచి బెంగళూరుకు మధ్యాహ్నం 2.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ రెండు గంటలు ఆలస్యమైంది. దానికి అధిక ఉష్ణోగ్రతలే కారణమని తెలుస్తోంది. దీంతో అప్పటికే విమానంలో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్