అసలే ఆడపిల్లల జనాభా తక్కువంటే.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యులు డబ్బులకు ఆశపడి లింగనిర్ధారణ
పరీక్షలు చేసి, ఆడపిల్లలు పుట్టకుండా పరోక్షంగా తల్లిదండ్రులకు సాయపడుతున్నారు. ఇటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఆ డాక్టర్ లైసెన్స్ రద్దు చేసేలా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తేవాలి. ఆడపిల్లలపై విద్యారంగంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. పట్టణాలలో ఇది కాస్త మెరుగ్గా ఉంది.