భారత్‌లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పర్యటన

83చూసినవారు
భారత్‌లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పర్యటన
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చారు. సోమవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్‌తో జేక్ సలివన్ సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనాలపై ఇరువురు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి మాట్లాడారు. అలాగే ఇరు దేశాలకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధి బృందాలతోనూ వీరు చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్