శ్రీలంకలోని దౌలగల గ్రామంలో శనివారం (జనవరి 11)న షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలిక తన ఫ్రెండ్‌తో కలిసి స్కూల్‌కు వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వారి ముందు ఓ వ్యాన్ ఆగింది. తేరుకునేలోపే ఆ బాలికను దుండగులు కారులోకి తోసేశారు. ఓ వ్యక్తి ఆ కిడ్నాపర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, వారు వదిలిపెట్టలేదు. క్షణాల్లో బాలికను కిడ్నాప్ చేసి, అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.