భారతదేశం 78 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా USA స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాలు సంపన్నమైన, సురక్షితమైన, స్థిరంగా ఉండే ప్రపంచం కోసం కలిసి పని చేస్తున్నాయని అన్నారు. ఆగస్ట్ 15ను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వెల్లడించారు.