ప్రధాని మోదీ జన్‌ధన్ యోజనను 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. ఈ పథకం అనేక లక్ష్యాలతో ప్రారంభించబడింది. దీని ద్వారా పేద ప్రజలు కూడా జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతాలను తెరవవచ్చు. ఈ జన్‌ధన్ యోజన కింద, లబ్ధిదారుడు ఖాతాలో రూ. 10,000 లోన్ పొందవచ్చు. అలాగే జన్‌ధన్ యోజన కింద రూ.లక్ష ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా కూడా లభిస్తుంది. లబ్ధిదారుడు మరణిస్తే వారి కుటుంబానికి ఈ డబ్బులు లభిస్తాయి.