కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా దేశంలో బంగారం ధర దాదాపు రూ.4వేలు తగ్గడం గమనార్హం. కేవలం బడ్జెట్ ప్రకటించిన రోజే ఆకస్మాత్తుగా రూ.3వేల దాకా పడిపోయింది. ఇక గురువారం తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,940గా ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,850కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.87,400గా ఉంది.