తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'రైతు బంధు'ను బంద్ చేసే ఆలోచనలో ఉందని శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు."రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు. ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తుందని రైతులు చెబుతున్నారు. పదవులు, ఓట్ల కోసం మేము పనిచేయము. రైతుకు ఏది మేలు చేస్తుంది అంటే మేము దానినే అమలు చేస్తాము" అని మంత్రి తెలిపారు.