స్మగ్లింగ్‌ హబ్‌గా కాకినాడ పోర్టు: పవన్ కల్యాణ్‌

81చూసినవారు
స్మగ్లింగ్‌ హబ్‌గా కాకినాడ పోర్టు: పవన్ కల్యాణ్‌
కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. కాకినాడ పోర్టులో తనిఖీలు చేసిన అనంత‌రం ప‌వ‌న్ మాట్లాడుతూ.. "2019-24 మధ్య కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించాం. పారదర్శక పాలన ఇస్తాం, అవినీతిని అరికడతామని ప్రజలకు మాట ఇచ్చాం. మేం వచ్చాక 51 వేల టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నాం. కాకినాడ పోర్టుకు రోజూ సుమారు వెయ్యి లారీలు వస్తాయి. సెక్యూరిటీ మాత్రం 16 మందే ఉన్నారు" అని పవన్‌ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్