కోర్టు కాంప్లెక్స్‌లో ప్రమాదవశాత్తు పేలిన గ్రెనేడ్‌.. పోలీస్‌ అధికారికి గాయాలు

85చూసినవారు
కోర్టు కాంప్లెక్స్‌లో ప్రమాదవశాత్తు పేలిన గ్రెనేడ్‌.. పోలీస్‌ అధికారికి గాయాలు
జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్ల జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న మల్ఖానాలో గురువారం ప్రమాదవశాత్తు గ్రెనేడ్‌ పేలింది. ఈ ఘటనలో ఓ పోలీస్‌ అధికారి గాయపడ్డారు. పేలుడు అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వేగంగా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. మల్ఖానా లోపల ప్రమాదవశాత్తు గ్రెనేడ్‌ పేలిందని.. డిప్యూటీలో ఉన్న సిబ్బందిలో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన అధికారిని ఆసుపత్రికి తరలించిన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్