గురుకుల కార్యదర్శి రోజూ ఒక గురుకుల పాఠశాలను పరిశీలించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురుకుల సొసైటీల కార్యదర్శులతో మంగళవారం భట్టి సమీక్ష చేపట్టారు. భవనాల అద్దె చెల్లింపునకు నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. అద్దె భవనాల యజమానులతో మాట్లాడి అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.క్షేత్రస్థాయిలో పాఠశాలను పరిశీలించి వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు.