జ్ఞాన్‌వాపి అనేది మసీదు కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అది శివుడి దేవాలయమని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన్‌వాపిని మసీదుగా పేర్కొంటున్నారని.. దీంతో పరమేశ్వరుడి సన్నిధికి వచ్చే భక్తులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు.