
నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు
AP: ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించాయి. దక్షిణాదిలో రెండు రోజు రోజులుగా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో రుతుపవనాలు వైదొలిగినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈసారి అదనంగా నెల రోజులు రుతుపవనాలు కొనసాగాయి.