దేశంలో చక్కెర ధరలు పెరగనున్నాయి. 2024-25 సీజన్ ( అక్టోబర్-సెప్టెంబర్)కు సంబంధించి చక్కెర, ఇథనాల్ కనీస విక్రయ ధర (ఎంఎస్‌పీ) పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో చక్కెర ధర పెరగనుంది. ‘చక్కెర కనీస విక్రయ ధరను పెంచాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నాం. అలాగే ఇథనాల్ ధరను కూడా పెంచుతాం. ఈ విషయం పెట్రోలియం శాఖ పరిశీలిస్తుంది’ అని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు.