తిరుపతిని రాష్ట్రంగా ప్రకటించండి.. అలా కుదరదన్న సుప్రీంకోర్టు

80చూసినవారు
తిరుపతిని రాష్ట్రంగా ప్రకటించండి.. అలా కుదరదన్న సుప్రీంకోర్టు
AP: తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం 700 మందికి పైగా జనాభా ఉన్న వాటికన్ సిటీ దేశంగా ఉన్నప్పుడు తిరుపతిని కూడా రాష్ట్రంగా గుర్తించాలని పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరుపతిని రాష్ట్రం చేస్తే దేశంలో ఉన్న ఇతర దేవాలయాల కోసం కూడా ఒక్కో రాష్ట్రాన్ని కేటాయించాల్సి ఉంటుందని పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్