యూపీలోని ముజఫర్నగర్లో గురువారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షాపులోకి వచ్చిన కస్టమర్లపై షాపు యజమాని, అతని అనుచరులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మేరకు పెళ్లికి సంబంధించిన బట్టలు కొనేందుకు ఓ కుటుంబం ఓ షాపులోకి వెళ్లింది. ఈ క్రమంలో ఏదో విషయమై వ్యాపారితో వారికి గొడవ జరిగింది. దీంతో ఆ వ్యాపారి, షాపు ఉద్యోగులు కలిసి కస్టమర్లను తీవ్రంగా కొట్టారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.