దేశంలోని ప్రతి ఒక్కరూ ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ పిలుపునిచ్చారు. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్ సైటులో అప్లోడ్ చేయాలని ఆయన కోరారు. ప్రధాని మోడీ గతంలో ప్రారంభించిన ఈ ప్రచారం పెద్ద ఉద్యమంగా మారిందని షా అభిప్రాయపడ్డారు.