అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత స్టార్ హార్దిక్ పాండ్యా నంబర్-1 స్థానంలోకి అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీలను వెనక్కి నెట్టి నంబర్ వన్‌కు ఎగబాకాడు. హార్దిక్ ప్రస్తుతం 244 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు.