సీఎం రేవంత్ పాలనలో రైతుల ధాన్యం దళారుల పాలైంది.. బోనస్ బోగస్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో వరి పంటకు బోనస్ ఇచ్చామని రేవంత్ అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల వరద కాలువను కేసీఆర్ రిజర్వాయర్‌గా మార్చిండు అని పేర్కొన్నారు. ఇక రైతుల సీఎం కేసీఆర్.. బూతుల సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్న హరీష్ రావు.. మూసీ పాదయాత్ర దమ్ముంటే ఇళ్లు కూలగొట్టిన చోట చెయ్ అని ఛాలెంజ్ విసిరారు.