టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ నమోదు (VIDEO)

85చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ రికార్డు సృష్టించారు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన హ్యాట్రిక్ వికెట్లు సాధించారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి రెండు బంతులకు మహ్మదుల్లా, హసన్‌లను ఔట్ చేశారు. అనంతరం 20వ ఓవర్ తొలి బంతికి మరో బంగ్లా బ్యాటర్ హృదయ్‌ను పెవిలియన్‌కు పంపారు. తద్వారా టీ20 వరల్డ్ కప్‌-2024లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ నిలిచారు.

సంబంధిత పోస్ట్