KGFలో బంగారం వేటకు సర్కారు సై

79చూసినవారు
KGFలో బంగారం వేటకు సర్కారు సై
దశాబ్దాలుగా మూతపడిన కోలారు బంగారు గనుల్లో (KGF) కార్యాచరణను పునఃప్రారంభించటంపై కర్ణాటక సర్కారు దృష్టిసారించింది. కోలారు, బంగారుపేటె, బంగారుదిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్ల గనుల్లో తవ్వకాలు చేపట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ తవ్వకాల బాధ్యతను భారత్ గోల్డ్‌మైన్ లిమిటెడ్ (BGML)కు ఇవ్వాలని, రాష్ట్రానికి ఈ సంస్థ నుంచి రావాల్సిన రాయల్టీ రూ.75.24 కోట్లను ఇప్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్