రష్యాపై మండిపడ్డ దక్షిణ కొరియా

59చూసినవారు
రష్యాపై మండిపడ్డ దక్షిణ కొరియా
రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై దక్షిణ కొరియా మండిపడింది. యుద్దాలు చేయడం, ఆక్రమణలకు పాల్పడటం వంటి చరిత్ర ఉన్న రెండు దేశాలు.. ఎప్పటికీ జరగని దాడుల గురించి ముందస్తుగా మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించింది. రష్యాపై పోరాడేందుకుగాను ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాల సరఫరాపైనా ఆలోచన చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో హెచ్చరించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్