నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

77చూసినవారు
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు. సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలుస్తారు.

సంబంధిత పోస్ట్