గాలిలో వేలాడే స్తంభమున్న దేవాలయం చూశారా..?

563చూసినవారు
గాలిలో వేలాడే స్తంభమున్న దేవాలయం చూశారా..?
వింతలు విచిత్రాలకు నెలవు మన భారతదేశం. అంతేకాకుండా అప్పటి రాజులు నిర్మించిన ఆలయాలు ఎంతో విచిత్రంగానూ, సాంకేతికంగా సవాల్ చేసే విధంగా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వాటిలో గాలిలో తేలుతూ ఉండే స్తంభమున్న ఆలయం ఒకటి ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఆ దేవాలయం కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అనంతపురం జిల్లాలో లేపాక్షికి సమీపంలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయం విచిత్రమైన నిర్మాణశైలితో ఉండి భక్తులను ఆకర్షిస్తోంది.