ప్రయాణికులతో కిక్కరిసిపోతున్న మెట్రో స్టేషన్‌లు

69చూసినవారు
ప్రయాణికులతో కిక్కరిసిపోతున్న మెట్రో స్టేషన్‌లు
మెట్రో రైళ్లలో రద్దీ తగ్గిందని విస్తృత ప్రచారం జరుగుతుంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా.. ఉద్యోగులు, విద్యార్థులతోపాటు సాధారణ ప్రజలు సైతం మెట్రోరైళ్లనే ఆశ్రయిస్తుండడంతో స్టేషన్లలో ఎప్పుడు చూసినా రద్దీనే కనిపిస్తోంది. ప్రతి 6 నిమిషాలకోసారి రైళ్లను నడుపుతున్న.. అవి సరిపోవడంలేదని స్టేషన్లలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కుతుండడంతో రైలు కిందపడుతారేమోనని భయపడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్