పాకిస్థాన్ ఓపెనర్ సామ్ అయ్యూబ్ స్టార్క్ బౌలింగ్‌లో ఫ్లిక్ షాట్ ద్వారా సిక్సర్ కొట్టి యువరాజ్ సింగ్‌ను గుర్తుకుతెచ్చాడు. అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 163 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. బ్యాటింగ్‌కు దిగిన అయ్యూబ్ 12వ ఓవర్లో ఫ్లిక్ షాట్ కొట్టాడు.
ఈ షాట్ చూసి క్రికెట్ అభిమానులు యువరాజ్ సింగ్‌ని గుర్తు చేసుకున్నారు. 2007 ప్రపంచకప్‌లో యువరాజ్ కొట్టిన సిక్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులుతోంది.