యూపీ హర్దోయ్‌లో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కాడు. తనకు మద్యం, చికెన్ కావాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. అవి ఇచ్చినా ఆ వ్యక్తి కిందకు దిగలేదు. అతడిని కిందికి దించేందుకు వాటర్ ట్యాంక్ ఎక్కిన ఇద్దరిని కిందికి తోసేశాడు. ఆ ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు 12 గంటల పాటు శ్రమించి చివరికి మతిస్థిమితం లేని వ్యక్తిని కిందికి దించారు.