యూరప్‌లోని చిన్న దేశమైన మాంటెనిగ్రోలో నూతన సంవత్సర ప్రారంభం రోజున అమెరికాలో మాదిరే దారుణమైన ఘాతుకం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా 12మందిని ఓ ఉన్మాది కాల్చి చంపేశాడు. పోలీసులు చుట్టుముట్టడంతో ఆ కిరాతకుడు తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు హోం మంత్రి డానిలొ సరనోవిక్ తెలిపారు. ఉన్మాది పారిపోతుండగా పోలీసులు అతడిని చుట్టుముట్టారని, దీంతో అతడు తనను తాను కాల్చుకుని చనిపోయాడని మంత్రి తెలిపారు.