మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోనిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమవారం కురిసిన వర్షానికి పొనార్ ఖుర్ద్ – ధాపర గ్రామాల మధ్య కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు వంతెనపై నుంచి పారుతోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బైక్‌పై వంతెన దాటుతుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే బైక్‌తో సహా గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం ఆధికారులు గాలింపు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.