BRS నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ తదుపరి విచారణను హైకోర్టు మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన సీజే ధర్మాసనం.. కౌంటర్లపై తుది వాదనలను వినిపించడానికి విచారణను మార్చి 20కి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.