తెలంగాణకు భారీ వర్ష సూచన

66చూసినవారు
తెలంగాణకు భారీ వర్ష సూచన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.