లక్కులో రూ. 26 లక్షల లాటరీ గెలుచుకున్న ట్రక్ డ్రైవర్

68చూసినవారు
లక్కులో రూ. 26 లక్షల లాటరీ గెలుచుకున్న ట్రక్ డ్రైవర్
అమెరికాలోని మేరీలాండ్ లో ఓ ట్రక్ డ్రైవర్ కు ఒక్కసారిగా లక్ష్మిదేవి తలుపుతట్టింది. పొరపాటున కొనుగోలు చేసిన కెనో లాటరీ టికెట్ కు ఏకంగా 32 వేల డాలర్ల బహుమతి దక్కింది. ఈ మొత్తం మన రూపాయల్లో 26 లక్షలకు పైమాటే. దీంతో అతను 40 డాలర్ల టికెట్ వల్ల 32 వేల డాలర్లు గెల్చుకున్నాడు. ఈ మొత్తాన్ని పొదుపు చేసుకుంటానని సదరు డ్రైవర్ చెప్పాడు. పది డాలర్ల లాటరీ కొనుగోలు చేసే సమయంలో చేసిన పొరపాటు తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.