ఢిల్లీలో ఒక్కసారిగా భారీ వర్షం (వీడియో)

63చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇవాళ సాయంత్రం బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ మొదలైంది. దీంతో రోజంతా ఉక్కపోతతో అల్లాడిన ఢిల్లీ వాసులకు సాయంత్రం ఉపశమనం లభించింది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు నమోదు కాగా, సాయంత్రం వర్షం రాగానే 22.6 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీలో వర్షం, ఈదురుగాలులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.