ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

54చూసినవారు
ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
రెమాల్‌ తీవ్ర తుఫాన్‌ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ.. పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్న నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడ్డాయి. దాంతో.. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్డుల కింద ఉన్న భక్తులు పరుగులు తీశారు. ఇక.. రెమాల్ తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలల ఉధృతి, ఈదురు గాలులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :