శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలు చూసేందుకు వ్యూ పాయింట్ వద్ద భారీగా ప్రజలు వచ్చారు. దీంతో వ్యూ పాయింట్ నుండి దోమలపెంట వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఉండలేక నరకయాతన అనుభవించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.