అభిమాని రేణుకా స్వామిని చంపిన కేసులో జైలులో ఉన్న కన్నడ సినీ హీరో దర్శన్‌కు రాజభోగాలు అందుతున్నాయి. జైలులో ఆయన సిగరెట్ తాగుతూ కనిపించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఇది మరువక ముందే గ్యాంగ్‌స్టర్ ధర్మతో హీరో దర్శన్ వీడియో కాల్లో సంభాషించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.