ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం కుబైసీ మృతి

69చూసినవారు
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం కుబైసీ మృతి
ఇజ్రాయెల్ సైన్యం బీరూట్ పై జరిపిన వైమానిక దాడిలో తమ టాప్ కమాండర్ ఇబ్రహీం మొహమ్మద్ కుబైసీ మృతి చెందినట్లు హిజ్బుల్లా బుధవారం ప్రకటించింది. కుబైసీతో పాటు అతడి బృందంలోని మరో ఇద్దరు కమాండర్లను హతమార్చినట్లు అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ పై పోరాటంలో కుబైసీ చేసిన కృషిని హిజ్బుల్లా ప్రశంసించింది. కాగా సోమవారం నుంచి హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 569 మంది మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్