బస్సు ఢీ.. తల నుజ్జునుజ్జు (వీడియో)

69చూసినవారు
యూపీలోని లక్నో వజీర్‌గంజ్ ప్రాంతంలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. వ్యక్తిగత పనిపై రిజ్వాన్ సైకిల్‌పై బయల్దేరాడు. సిటీ నర్సింగ్ హోమ్ ముందు రోడ్డుపై వెళ్తున్న ఆయనను వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. దీంతో సైకిల్‌పై నుంచి రిజ్వాన్ కింద పడ్డాడు. అతడి తలపై నుంచి బస్సు చక్రాలు దూసుకెళ్లాయి. తల నుజ్జునుజ్జు అవడంతో సంఘటనా స్థలంలోనే రిజ్వాన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్