వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం బాధాకరమని హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కాగా, ఈ తీవ్ర విషాద ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు.