ఏపీలో కూటమి గెలుపులో కీలక భూమిక పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర రాజకీయాల్లోనూ అడుగుపెట్టనున్నారు. దేశ వ్యాప్తంగా పీకేకు ఫుల్ క్రేజ్ ఉండడంతో మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రచారం చేయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 16, 17న మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేయనున్నారు. తెలుగు ప్రజల మద్దతు పొందగలిగే ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది.