AP: తూ.గో. జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి బంగారంపేటలో ఘోరం జరిగింది. కృష్ణ తులసి (33) మొదటి భర్తతో విడిపోయి మురళీకృష్ణను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయి కొడుకుతో కలిసి కృష్ణతులసి బంగారుపేటలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మురళీకృష్ణ కూడా అక్కడే కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు. కృష్ణతులసి తండ్రి దగ్గరి నుంచి మురళీకృష్ణ కొంత సొమ్ము తీసుకున్నాడు. ఆ డబ్బులు అడిగిన ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.