AP: రైతులకు బిగ్ అలర్ట్. టమాటా ధరల పతనం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి టమాటాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది. అయితే ఏ ధరకు కొనుగోలు చేస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు. కొనుగోలు చేసిన టమాటాలను రైతు బజార్లలో విక్రయించనుంది. అలాగే పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయనుంది. కాగా, కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కేజీ టమాటా ధర రూ.4కి పడిపోయింది.