కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇద్దరి ఆర్థిక నిపుణుల పదవీ కాలాల్ని పొడిగించింది. నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ) బీవీఆర్ సుబ్రహ్మణ్యంకు మరో ఏడాది అవకాశమిచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని కూడా కేంద్రం రెండేళ్లు పొడిగించింది. బడ్జెట్‌కు ముందు పార్లమెంటుకు సమర్పించే ఆర్థిక సర్వే రూపకల్పనలో వీరు కీలక పాత్ర పోషిస్తారు.