పొట్టలోకి నులిపురుగులు ఎలా చేరతాయో తెలుసా?

577చూసినవారు
పొట్టలోకి నులిపురుగులు ఎలా చేరతాయో తెలుసా?
చాలా మంది పిల్లల్లో నులిపురుగుల ఇన్‌ఫెక్షన్ చూడొచ్చు. కలుషిత ఆహారం, నీరుతో పాటు క్రిముల గుడ్లు ఉండే మట్టిని తాకడం, చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల శరీరంలోకి పురుగులు సంక్రమిస్తాయి. మలంలో పొడవైన పురుగులు కనిపించడం, పొత్తికడుపు నొప్పి, మలద్వారం వద్ద దురద వీటి ప్రధాన లక్షణాలు. ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వార్మ్స్ అని అంటారు. మురుగునీటి నిర్వహణ సరిగా లేకపోవడం, అపరిశుభ్ర మరుగుదొడ్ల వల్ల కూడా ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుంది.