US కాలిఫోర్నియాలో నలుగురు వ్యక్తులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి పడి జైలు పాలయ్యారు. ఎలుగుబంటి వేషాలతో తమ లగ్జరీ కార్లను ధ్వంసం చేసుకుని రూ.1.18 కోట్ల క్లెయిమ్ కు ప్రయత్నించారు. ఈ మేరకు వీడియోలు, ఫొటోలను ఆధారంగా చూపించారు. అనుమానం వచ్చిన సంస్థ డిటెక్టివ్ లను రంగంలోకి దింపగా వీడియోల్లో ఉన్నది మనుషులేనని తేలింది. వారి ఇళ్లలో సోదాలు చేయగా ఎలుగుబంటి దుస్తులు కనిపించాయి. దీంతో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.