మన శరీరం రోజుకు ఒకసారి కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది శరీర సాధారణ ప్రక్రియ. ఈ ఆరోగ్యకరమైన కార్టిసాల్ ఉదయం కాకుండా రాత్రి 8-9 గంటల మధ్య విడుదల అయితే, అది డిప్రెషన్‌కు దారితీస్తుందని ఓ పరిశోధనలో తేలింది.
కాబట్టి ఉదయాన్నే సూర్యరశ్మి తగలడం ద్వారా, ఆరోగ్యకరమైన కార్టిసాల్ స్థాయిలను సాయంత్రం కాకుండా ఉదయానికి మార్చడం ద్వారా డిప్రెషన్ వంటి వ్యాధులను నివారించవచ్చని అధ్యయనాలు తేల్చాయి.