కోళ్ళలో సీఆర్‌డి వ్యాధి లక్షణాలు గమనించడం ద్వారా, లేక మరణించిన కోడిని శవపరీక్ష చేయడం ద్వారా గుర్తించవచ్చు. శ్వాసనాళంలో తెమడ, ఎర్రగా కమిలి ఉండటం, గాలి గదులు దళసరిగా మారి, వాటిలో తెలుపు నుండి పసుపు పచ్చటి పదార్థం ఉండటం, ఊపిరితిత్తులు కమిలిపోవడం కనిపిస్తాయి. గుండె, కార్జము, పొట్ట ప్రేగులపైన తెల్లటిపొర ఏర్పడటాన్ని గుర్తించవచ్చు. కాంప్లికేటెడ్ సిఆర్‌డి అయితే లక్షణాలు మరింత తీవ్రంగా కనిపిస్తాయి.