ప్రస్తుతం అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60-80 వేలకు పైగా కొలువులు రాగలవని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉంటాయన్నారు.